వడదెబ్బతో విద్యార్థిని మృతి..?
VZM: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజాంలో 8వ తరగతి చదువుతున్న షేక్ ముంతాజ్ గురువారం పాఠశాల నుంచి ఇంటికి వెళుతుండగా దారిలో స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే బాలికను ఏరియా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. వడదెబ్బ కారణంగా ముంతాజ్ మరణించి ఉంటుందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.