ఆధ్యాత్మికత తోనే మానసిక ప్రశాంతత

ఆధ్యాత్మికత తోనే మానసిక ప్రశాంతత

SRD: ఆధ్యాత్మికత, దైవచింతనతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని మల్లయ్య గిరి ఆశ్రమ పీఠాధిపతి డాక్టర్ బసవలింగ అవధూత అప్పాజీ అన్నారు. ఆదివారం సదాశివపేట మండలం తంగడపల్లిలో జరిగిన సార్వజనిక మహా పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కార్తీక మాసంలో భక్తి భావంతో కార్యక్రమాలు చేపడితే పుణ్యఫలం లభిస్తుందన్నారు. మాజీ ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు.