స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సుప్రీం కీలక ఆదేశాలు
స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని మహారాష్ట్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జేకే బాంటియా కమిషన్ ఓబీసీలకు 27 శాతం కోటాను సిఫార్సు చేసిన మేరకు.. 2022కు ముందు ఉన్న పరిస్థితి ప్రకారం ఎన్నికలు నిర్వహించవచ్చని సూచించింది.