VIDEO: ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్.. ఇద్దరికి అస్వస్థత
సూర్యాపేటలో కోహేన్స్ ఫార్మా కంపెనీలో గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్‌తో ఎఎన్ఎఫ్‌డీ యూనిట్‌లో గ్యాస్ లీకై ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురవడంతో వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు కంపెనీ ముందు భారీ ఆందోళన చేపట్టారు. జనావాసాల మధ్య ఉన్న ఈ పరిశ్రమను తక్షణమే తరలించాలని డిమాండ్ చేశారు.