'ఆదోనిలో నాన్-వెజ్ విక్రయాలపై నిషేధం'

'ఆదోనిలో నాన్-వెజ్ విక్రయాలపై నిషేధం'

KRNL: ఆదోని మున్సిపల్ కమిషనర్ ఎం. కృష్ణ బుధవారం ఓ ప్రకటనలో, ఈనెల 15వ తేదీన 79వ స్వాతంత్య్ర దినోత్సవం, 16వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పట్టణంలో మటన్, చికెన్, ఇతర నాన్-వెజిటేరియన్ వ్యాపారాలు చేపట్టరాదని ఆదేశించారు. ఈ తేదీల్లో ఎవరైనా నాన్-వెజిటేరియన్ విక్రయాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ కృష్ణ హెచ్చరించారు.