యుద్ధ పరిస్థితులను గమనిస్తున్నాం: మోదీ

యుద్ధ పరిస్థితులను గమనిస్తున్నాం: మోదీ

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులను గమనిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. గల్ఫ్ దేశాల్లో యుద్ధం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని, ముడిచమురు, గ్యాస్, ఎరువుల రవాణాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మనకు ఎక్కువగా గల్ఫ్ నుంచే ముడిచమురు, గ్యాస్ వస్తోందన్నారు. గల్ఫ్ దేశాలతో నిరంతరం చర్చలు జరుపుతున్నామన్నారు. భారత్‌కు వచ్చే నౌకలన్నీ హర్మూజ్ జలసంధి నుంచే వస్తాయన్నారు.