బురదలో నాట్లు వేసి నిరసన తెలిపిన సీపీఐ నాయకులు

జనగామ: బచ్చన్నపేట మండలం కేసిరెడ్డిపల్లి గ్రామంలో రోడ్డు పరిస్థితి ఇది. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామంలోని రోడ్డు మొత్తం బురదమయంగా మారింది. దీంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న CPI(M) నాయకులు గురువారం ఉదయం బురదలో నాట్లు వేసి నిరసనలు తెలిపారు. అధికారులు, పాలకులు స్పందించి రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు.