జగ్గయ్యపేటలో కార్తీక మాస మహోత్సవాలు
NTR: జగ్గయ్యపేట పట్టణంలోని శ్రీ చంద్రమౌలేశ్వర స్వామి వారి పెద్ద శివాలయంలో కార్తీక మాస మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు స్వామివారి నగరోత్సవం ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పాల్గొని, టెంకాయ కొట్టి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.