పరిసరాలను శుభ్రం చేసిన జాయింట్ కలెక్టర్
కృష్ణా: మచిలీపట్నం 44వ డివిజన్ గాదిరెడ్డి వీధిలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నవీన్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా వ్యాధులు బారిన పడకుండా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.