VIDEO: విచారణకు పూర్తిగా సహకరిస్తాం: మంత్రి
HYD: కొవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ 2021లో ఇందిరా పార్క్ వద్ద శాంతియుత దీక్ష చేసినందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమపై కుట్రపూరితంగా కేసు నమోదు చేసిందని మంత్రి సీతక్క అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పేద ప్రజల ప్రాణాల కోసం నిరహార దీక్ష చేశామన్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. కేసు తదుపరి విచారణను కోర్టు డిసెంబర్ 18కి వాయిదా వేసిందన్నారు.