'అర్హత గల దివ్యాంగుల పెన్షన్లను తొలగించవద్దు'

ప్రకాశం: అర్హత గల దివ్యాంగుల పెన్షన్‌ను ప్రభుత్వం తొలగించవద్దని కనిగిరి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం పట్టణంలోని పలు వార్డులలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. అంగవైకల్యం తక్కువ ఉన్న దివ్యాంగుల పెన్షన్ ప్రభుత్వం తొలగించకుండా అర్హులకు న్యాయం చేయాలని మున్సిపల్ ఛైర్మన్ ప్రభుత్వాన్ని కోరారు.