రెండు గంటల్లోనే యువతి ఆచూకీ లభ్యం
విశాఖపట్నం 4-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తప్పిపోయిన యువతి కేసును పోలీసులు కేవలం రెండు గంటల్లోనే ఛేదించారు. యువతి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించి విస్తృతంగా గాలించి ఆమెను సురక్షితంగా కనిపెట్టారు. అనంతరం యువతిని కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించారు. పోలీసుల ప్రతిభను సీపీ డా. శంఖబ్రత బాగ్చి పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.