CMRF చెక్కును అందజేసిన ఎమ్మెల్యే
NLR: సీతారాంపురం మండలం దేవమ్మచెరువు మాజీ సర్పంచ్ శ్రీనివాసులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.2,76,817 చెక్కును ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మంగళవారం వింజమూరులోని టీడీపీ కార్యాలయంలో అందజేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన శ్రీనివాసులు ఆర్థిక అవసరాల నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారన్నారు. చెక్కును అందుకున్న కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.