వర్షానికి కూలిన ఇంటి పైకప్పు

కడప: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మైదుకూరు పట్టణం పాతూరులో నివాసము ఉంటున్న ఓబులమ్మకు చెందిన ఇల్లు పూర్తిగా దెబ్బతింది. సోమవారం ఇంటి పైకప్పు వర్షానికి తడిసి కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చాలాకాలంగా ఇక్కడే ఉంటున్నానని, న్యాయం చేయాలని బాధిత మహిళ మొరపెట్టుకుంది.