'భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి'
WNP: రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్ అధికారులకు సూచించారు. బుధవారం వనపర్తి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో భూ సమస్యల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. 60 రోజుల వ్యవధి దాటిన భూ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.