సీతారాముల కల్యాణ మహోత్సవం

సీతారాముల కల్యాణ మహోత్సవం

AKP: పరవాడ మండలం వెన్నెలపాలెం రామాలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు రామాలయానికి చేరుకుని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. కళ్యాణం అనంతరం భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి దంపతులు పాల్గొన్నారు.