'కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి'

ASF: తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్‌లో జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు చేస్తున్న సమ్మెకు శనివారం ఆయన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.