జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడానికి కట్టుబడి ఉన్నాం: కేంద్ర మంత్రి
WG: చిత్తడి నేలలను కాపాడుకోవడానికి, జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర సహాయ మంత్రి, నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. కొల్లేరు సరస్సు పరిరక్షణ కమిటీ ప్రతినిధులు గురువారం న్యూఢిల్లీలో మంత్రిని కలిశారు. కొల్లేరు సరస్సు పరిరక్షణకు సంబంధించిన పలు విషయాలను చర్చించినట్లు ఆయన తెలిపారు.