ఎమ్మెల్యే మార్నింగ్ వాక్.. సమస్యలపై ఆరా
NGKL: అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ శుక్రవారం ఉదయం పట్టణంలోని పలు వార్డుల్లో మార్నింగ్ వాక్ చేస్తూ పర్యటించారు. అడ్డా కూలీలను కలిసి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అలాగే కాలనీవాసులతో మాట్లాడి స్థానిక సమస్యలపై చర్చించారు. మున్సిపాలిటీలోని సమస్యలన్నింటినీ వార్డుల వారీగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.