రేపే వేసవి సెలవులు ప్రారంభం

రేపే వేసవి సెలవులు ప్రారంభం

WNP: ఏడాది పొడవునా పాఠాలు, పరీక్షలతో గడిపిన పిల్లలకు రేపటి నుంచి వేసవి సెలవులు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రంలో ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు పాఠశాలలు మూతపడనున్నాయి. తీవ్ర ఎండల నేపథ్యంలో మధ్యాహ్న సమయంలో పిల్లలు బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈతకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.