VIDEO: 'సోంపేటలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా'
SKLM: సోంపేట పట్టణంలోని సినిమా థియేటర్ వద్ద శుక్రవారం ఎన్టీఆర్ ఫ్యాన్స్ సందడి చేశారు. దేవర సినిమా విడుదల సందర్భంగా పట్టణంలోని థియేటర్ వద్ద డప్పు వాయిద్యాలు వాయిస్తూ.. డాన్సులతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హోరెత్తారు. తీన్మార్ స్టెప్పులు వేస్తూ పండగ వాతావరణాన్ని సృష్టించారు. జై ఎన్టీఆర్ నినాదాలు చేశారు.