VIDEO: గుంతలో పడి ఓ వ్యక్తి మృతి

ASR: జీ.మాడుగుల మండలంలోని కే.కోడాపల్లి గ్రామం వద్ద హైవే నిర్మాణ పనుల్లో భాగంగా కాంట్రాక్టర్ రోడ్డుకు మధ్యలో పెద్ద గుంతను తవ్వి కల్వర్టు నిర్మాణం చేపట్టారు. ఇటీవల విస్తారంగా కురిసిన వర్షానికి ఆ కల్వర్టు సమీపంలో ఉన్న గుంతలో పెద్ద చెరువును తలపించేలా నీరు నిండింది. గురువారం సాయంత్రం పలాసి సోమేశ్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు ఆ గుంతలో జారిపడి మృతి చెందాడు.