పూసలపాడు సచివాలయాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో

పూసలపాడు సచివాలయాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో

ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని పూసలపాడు గ్రామ సచివాలయాన్ని ఎంపీడీవో రంగనాయకులు గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆ సచివాలయంలోని పలు రికార్డులను ఆయన పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. విధులలో అలసత్వం వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.