కోతకు గురైన వంతెనను పరిశీలించిన ఎమ్మెల్యే

ADB: ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ పర్యటించారు. శనివారం కురిసిన భారీ వర్షానికి నీట మునిగిన పలు పంట పొలాలను, కోతకు గురైన వంతెనను పరిశీలించారు. నష్ట పోయిన పంటలకు ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందెలా చూస్తానన్నారు. కోతకు గురైన వంతెనను బాగు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట దయాకర్, రమణ ఉన్నారు.