ఊటీని తలపిస్తున్న అనంతపురం పరిసరాలు

ఊటీని తలపిస్తున్న అనంతపురం పరిసరాలు

ATP: జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా అనంతపురం పట్టణంలో శనివారం ఉదయం దట్టమైన పొగమంచు తీవ్రంగా కమ్మేసింది. మంచు అందాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకున్నాయి. ఈ వాతావరణం కారణంగా ఉదయం వేళల్లో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అనంతపురం పరిసరాలు ఊటీని తలపిస్తున్నాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.