ఘనంగా అంబేద్కర్ జాతర

SRD: సంగారెడ్డిలోని పాత బస్టాండ్ వద్ద కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జాతర మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. బహుజన కళాకారుడు ఎవరి సోమన్న ఆటపాట ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్, జిల్లా కార్యదర్శి అశోక్, పలువురు నాయకులు పాల్గొన్నారు.