గరివిడి అనే నేను.. వీడియో వైరల్
గరివిడి అనే నేను మీ రాష్ట్రంలో ఒక ఊరిని అంటూ యూట్యూబ్‌లో ఒక వీడియో వైరల్ అవుతోంది. విజయనగరం జిల్లాలో మండలమైన గరివిడి ఈ వీడియోలో తన బాధను చెప్పుకుంటోంది. "50 ఏళ్లు క్రితం ఇక్కడ ఒక వ్యాపారితో కలిసి అనేక కంపెనీలు, హాస్పిటళ్లు, స్కూళ్ళు నిర్మాణంలో భాగస్వామినయ్యాను. నా ప్రజలకు ఎన్నో సంక్షేమ, ఉపాధి అవకాశాలను కల్పించాను. అలాంటి నన్ను ప్రస్తుతం రియల్ ఎస్టేట్ కు అడ్డాగా మార్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం నన్ను పట్టించుకోవాలని" వాపోయింది.