VIDEO: గోదావరిలో కొట్టుకొచ్చిన వృద్ధుడి మృతదేహం
E.G: రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్ వద్దకు గుర్తు తెలియని ఓ వృద్ధుడి మృతదేహం శుక్రవారం సాయంత్రం కొట్టుకొచ్చింది. గుర్తించిన స్థానికులు 3వ పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఆచూకీ తెలిసినవారు పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు. ఘటనపై ఎస్సై కేసు నమోదు చేశారు.