అమెజాన్‌లో సరికొత్త ఫీచర్

అమెజాన్‌లో సరికొత్త ఫీచర్

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. షాపింగ్ చేసే వారికి ఉపయోగపడేలా 'ప్రైస్ హిస్టరీ' అనే కొత్త ఆప్షన్‌ను అందుబాటులో ఉంచింది. దీనిద్వారా గత 30-90 రోజుల్లో ఒక వస్తువు ధర ఎంత నుంచి ఎంతకు తగ్గింది లేదా పెరిగింది అనేది తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ఆఫర్ సేల్ సమయాల్లో బాగా ఉపయోగపడుతుందని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.