పత్తికొండలో ఆదోని జిల్లా సాధన కోసం ధర్నా
కర్నూలు: ఆదోని జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం పత్తికొండ ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. దస్తగిరి నాయుడు, కోదండ నాగరాజు, రామచంద్రారెడ్డి నేతృత్వంలో నిరసన తెలిపి వినతిపత్రం అందజేశారు. ఆదోని, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల అభివృద్ధికి జిల్లా ఏర్పాటు అవసరమని నాయకులు పేర్కొన్నారు.