సైబర్ మోసాలపై అవగాహాన అవసరం: సీఐ

SKLM: గ్రామీణ ప్రాంత ప్రజలు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని టెక్కలి సీఐ ఏ.విజయ్ కుమార్ అన్నారు. సంకల్పం కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి టెక్కలి మండలం డమర గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు. మైనర్ డ్రైవింగ్, మాదకద్రవ్యాలు, మహిళా రక్షణ, దొంగతనాలు ఇతర ముఖ్యమైన అంశాలపై సీఐ అవగాహాన కల్పించారు. ఈయనతో పాటు టెక్కలి పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.