VIDEO: సీతారాములకు కలెక్టర్ పట్టు వస్త్రాలు
కృష్ణా: శ్రీరామ నవమి సందర్భంగా మచిలీపట్నంలోని భద్రాద్రి రామాలయంలో కలెక్టర్ డీకే బాలాజీ సీతారాములకు పట్టు వస్త్రాలను శుక్రవారం సమర్పించారు. ఈ నేపథ్యంలో పట్టు వస్త్రాలతో వచ్చిన కలెక్టర్ దంపతులకు ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.