కండక్టర్‌గా మారిన డిప్యూటీ స్పీకర్

W.G: 'స్త్రీ శక్తి' పథకాన్ని దుంపగడపలో శుక్రవారం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు. కండక్టర్‌గా మారి మహిళలకు ఉచిత టికెట్లు ఇచ్చారు. ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. జిల్లాలో మొత్తం 297 బస్సులకుగాను 225 బస్సులు ఈ పథకంలో సేవలందిస్తున్నాయని, ప్రభుత్వం రూ. 2 వేల కోట్లు కేటాయించిందని ఆయన వివరించారు.