నల్గొండ డీసీసీ చీఫ్ భద్రతపై సందేహాలు

నల్గొండ డీసీసీ చీఫ్ భద్రతపై సందేహాలు

నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేతకు భద్రత ముప్పు ఉందని, తక్షణమే గన్‌మేన్లను కేటాయించాలని కాంగ్రెస్ ఎస్సీ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కురుపాటి గణేష్ డిమాండ్ చేశారు. చండూరులో ఆయన మాట్లాడుతూ.. నిత్యం ప్రజల్లో ఉండే కైలాష్ నేతకు 1+1 భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీ, ఇంటెలిజెన్స్ వర్గాలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఈ విషయంపై వెంటనే స్పందించాలన్నారు.