నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

W.G: 33/11KV కోళ్లపర్రు విద్యుత్ ఉపకేంద్రము పరిధిలో 11KV కోళ్లపర్రు ఫీడర్‌లో విద్యుత్ తీగలపై వాలిన చెట్లు కొట్టే నిమిత్తం మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ వెంకటేశ్వరరావు తెలిపారు. చెరుకువాడ ఆక్వా, కోళ్లపర్రు గ్రామం, ఆక్వా సాగు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన వివరించారు.