మాజీ సీఎంను కలిసిన మాజీ ఎమ్మెల్యే

మాజీ సీఎంను కలిసిన మాజీ ఎమ్మెల్యే

AKP: నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైసీపీ కమిటీల నిర్మాణంలో నర్సీపట్నం నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలవడంతో ప్రత్యేకంగా అభినందించారు. త్వరలోనే నియోజకవర్గ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని జగన్ పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.