శానిటేషన్ వర్కర్‌కు ఉపాధ్యాయులు చేయూత

AKP: ఎస్. రాయవరం మండలం దార్లపూడి జడ్పీ హైస్కూల్ శానిటేషన్ వర్కర్ లక్ష్మి తన ఇంటి మరమ్మతులు చేయించుకునేందుకు 2017-2023లో హైస్కూల్ ఓపెన్ చేసిన ఉపాధ్యాయులు గురువారం రూ.18,500 ఆర్థిక సహాయం అందించారు. ఆమె ఆర్థిక పరిస్థితితో పాటు ఉన్న ఇల్లు సరిగా లేకపోవడంతో వారు స్పందించారు. విశ్రాంత ఎంఈవో జోషి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అందించిన సహకారానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.