RGV నన్ను స్టార్‌ని చేశాడు: నాగార్జున

RGV నన్ను స్టార్‌ని చేశాడు: నాగార్జున

రామ్ గోపాల్ వర్మ తనతో ‘శివ’ మూవీ తీసి తనను పెద్ద స్టార్‌ని చేశాడని నాగార్జున అన్నారు. శివ రీరిలీజ్ ట్రైలర్ విడుదల సందర్భంగా.. తాజాగా ఈ సినిమా మళ్లీ చూశానని, అద్భుతంగా అనిపించిందని పేర్కొన్నారు. రీరిలీజ్ కోసం RGV మళ్లీ 6 నెలలు కష్టించి ఒరిజినల్ సినిమా చేసినట్లుగా డిజైన్ చేశాడని తెలిపారు. నిజంగా డాల్బీ ఆట్మాస్‌లో అదిరిపోతుందని అన్నారు.