బసవేశ్వరుడి జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే
SRD: రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని బీరంగూడలో మహాత్మ బసవేశ్వరుడు 893వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బసవేశ్వరుడు సమానత్వం, కులమత భేదాల నిర్మూలన కోసం పోరాడిన మహనీయుడని, ఆయన బోధనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో లింగాయత్ సమాజం ప్రతినిధులు పాల్గొన్నారు.