మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో

మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో

ELR: గణపవరం జడ్పీ బాయ్స్ హైస్కూల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంపీడీవో బేబి శ్రీలక్ష్మి శుక్రవారం తనిఖీ నిర్వహించారు. ఆమె విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఆహార పదార్థాలు రుచికరంగా ఉన్నాయని కితాబిచ్చారు. పాఠశాలలోని విద్యార్ధులు వరుస సంఖ్యలో వచ్చి భోజనం చేయడం స్ఫూర్తిదాయకం అన్నారు.