ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ అల్లుకున్న గడ్డితీగలు
SRD: సిర్గాపూర్ మండలం గోసాయిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్లాట్ ఫామ్ చుట్టూ పచ్చని గడ్డి తీగలు అల్లుకున్నాయి. ఇవి ప్రమాదకరంగా మారాయని స్థానికులు నేడు తెలిపారు. గాలి వీచినప్పుడు తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందన్నారు. అధికారులు స్పందించి విద్యుత్ వైర్లకు అల్లుకున్న గడ్డి తీగలను తొలగించాలని కోరుతున్నారు.