'సాంకేతికతను అందిపుచ్చుకోవాలి'

'సాంకేతికతను అందిపుచ్చుకోవాలి'

ASR: సాంకేతికతను అందిపుచ్చుకుని లబ్దిదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని కొయ్యూరు ఎంపీపీ రమేశ్, రాష్ట్ర జీసీసీ మాజీ ఛైర్మన్ ప్రసాద్, సీఐ శ్రీనివాసరావు అన్నారు. గురువారం కొయ్యూరులో ఐసీడీఎస్ సీడీపీవో ఎల్.దేవమణి ఆధ్వర్యంలో జరిగిన అంగన్వాడీలకు సెల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాజెక్టు పరిధిలోని 164 కేంద్రాల సిబ్బందికి ఫోన్లు పంపిణీ చేశారు.