VIDEO: గోల్కొండ కోటలో ఫుల్ డ్రెస్ రిహార్సల్స్

HYD: ఈనెల 15వ తేదీన జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోటలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గోల్కొండ కోటలో ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు రిహార్సల్స్‌ను పర్యవేక్షించారు. అనంతరం వేడుకల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.