వైద్య సేవల్లో అలసత్వం వద్దు: కలెక్టర్
NGKL: ఉప్పునుంతల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, ల్యాబ్, ఫార్మసీ సేవలను సమీక్షించి, రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఆసుపత్రి శుభ్రత, మందుల లభ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సిబ్బంది విధుల్లో అలసత్వం వహించకూడదని ఆయన స్పష్టం చేశారు.