రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌కు జయచంద్ర ఎంపిక

రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌కు జయచంద్ర ఎంపిక

WGL: సీఎం కప్ బేస్‌బాల్ ఎంపిక పోటీల్లో వర్ధన్నపేట మండలం ల్యాబర్తి పాఠశాల 9వ తరగతి విద్యార్థి సంకినేని జయచంద్ర ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. ఈ నెల 17 నుంచి 20 వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో రాష్ట్రస్థాయి పోటీల్లో వరంగల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ సందర్భంగా శనివారం ప్రధానోపాధ్యాయులు శైలజ విద్యార్థిని అభినందించారు.