ఇంటర్ విద్య అధికారిని కలిసిన అధ్యాపకులు

ఇంటర్ విద్య అధికారిని కలిసిన అధ్యాపకులు

మెదక్: జిల్లా ఇంటర్ విద్యాధికారిగా పదవీ బాధ్యతలు తీసుకున్న మాధవిని పలువురు అధ్యాపకులు కలిశారు. ఈ సందర్భంగా ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఇంటర్ విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.