ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు విజ్ఞప్తి

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు విజ్ఞప్తి

సత్యసాయి: పుట్టపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పల్లె సింధూరను ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కలిసి తమ సమస్యలను వివరించారు. కొన్ని ఏళ్లుగా పని చేస్తున్న ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. తమ సేవలకు గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే వారి సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.