బాల్య వివాహాలపై అవగాహన

బాల్య వివాహాలపై అవగాహన

MDK: హవేలి ఘనపూర్ మండలం బూరుగుపల్లి గ్రామంలో బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. విజువల్ ఎన్జీవో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నవనీత ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. బాలికలకు 18 ఏళ్లు, బాలురకు 21 ఏళ్లు వచ్చాకే పెళ్లిళ్లు చేయాలని సూచించారు. బాల్యవివాహాలు జరిగితే పురోహితులు, భాజా భజంత్రీలు, ఫోటోగ్రాఫర్లపై కేసులు నమోదవుతాయని హెచ్చరించారు.