గుర్తు తెలియని వ్యక్తి మృతి
W.G: నరసాపురం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపై బుధవారం గుర్తు తెలియని ఓ వ్యక్తి (45) మృతి చెందారు. రైలు ఎక్కేందుకు వచ్చిన ఆయన అస్వస్థతతో అక్కడికక్కడే కన్నుమూశారు. మృతుని వివరాలు తెలియరాలేదు. ఆచూకీ తెలిసిన వారు భీమవరం GRP ఎస్సై సుబ్రహ్మణ్యం ను 9908448729 నెంబరుకు సంప్రదించాలని పోలీసులు కోరారు. ప్రస్తుతం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.