ప్రభుత్వ సలహాదారును కలిసిన ఏకగ్రీవ సర్పంచ్
NZB: సాలూర క్యాంప్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే. విజయ్ భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి గురించి చర్చించారు. ఆయనతో పాటు వార్డు సభ్యుల అభ్యర్థులు, నాయకులు మహేష్ రెడ్డి, శ్రీను, నాగేశ్వరరావు రమేష్ పాల్గొన్నారు.